ఘనంగా జయ పాఠశాలలో కవలల దినోత్సవ వేడుకలు
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 21(ప్రతినిధి మాతంగి సురేష్): అంతర్జాతీయ కవల పిల్లల దినోత్సవ వేడుకలు జయ పాఠశాల యాజమాన్య ఆధ్వర్యంలో ముందస్తుగా శనివారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కవల పిల్లల మధ్య కేక్ కట్ చేసి కవలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కవల పిల్లలకు కవలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలవేరు వేణు మాట్లాడుతూ ఒకే పోలికలతో జన్మనిచ్చిన కవల పిల్లలను గుర్తుపట్టడం ఎంతో కష్టంగా ఉంటుందని తెలిపారు. సాధారణంగా కొద్ది వ్యవధిలో కాన్పులలో జన్మించిన పిల్లలు ఒకే రూపాన్ని పోలి ఉంటారు వీరిలో పోలికలు నూటికి 99 శాతం ఒకే రకం ఉంటాయి కవలలను ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత అనుబంధం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కవలల బంధాన్ని వారి ప్రత్యేకతను గౌరవించటానికి ఈ వేడుకలు జరుపుకుంటామని గుర్తు చేశారు. తమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఆరు జతల కవల పిల్లలు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కవలల అసోసియేషన్ అధ్యక్షులు చలిగంటి రామారావు, చలిగంటి లక్ష్మణ్ రావు అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



