కోదాడ,జనవరి 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘాలు వాసవి క్లబ్స్ రాజకీయ పక్షాలు జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు.పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాత ఎంపీపీ కార్యాలయంలో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వైశ్య సంఘ నాయకులు మాట్లాడుతూ గాంధీజీ అనుసరించిన శాంతి సహనం తదితర అంశాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.వాసవి క్లబ్ కోదాడ,వాసవి యూత్ క్లబ్ కోదాడ,వాసవి సీనియర్ సిటిజన్స్ క్లబ్ కోదాడ సర్కిల్ రాందేవ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాలలో పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు,రాయపూడి వెంకటనారాయణ,చర్ల ప్రకాష్ రావు,గారినే కోటేశ్వరరావు,వంగవీటి నాగరాజు,జగిని ప్రసాద్,చల్లా లక్ష్మీ నరసయ్య,యాదా సుధాకర్,ఇమ్మడి రమేష్,ఇరుకుల్ల చెన్నకేశవరావు,ఇమ్మడి అనంత చక్రవర్తి,వంగవీటి భరత్ చంద్ర,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జాతిపితకు నివాళులు.
RELATED ARTICLES



