ఘనంగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజన్ గౌడ్ జన్మదిన వేడుకలు…
:కోదాడలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద భారీ కేక్ కటింగ్
:జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పై అభిమానం చాటుకున్న జర్నలిస్టులు..
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 27:జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదిన వేడుకలను కోదాడ పట్టణంలోని ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.మొదట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ చౌరస్తా నుండి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో డీజే సౌండ్ సిస్టంతో జర్నలిస్టులు వ్యవసాయ మార్కెట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం భారీ ఊరేగింపుతో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ కు స్వాగతం పలికే పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద భారీ కేక్ కట్ చేయించారు.అనంతరం పలువురు జర్నలిస్టు నాయకులు గజ మాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.పట్టణంలోని శనగల రాధాకృష్ణ ఆశ్రమంలో మానసిక వికలాంగులకు అంజన్ గౌడ్ జన్మదిన పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని నేరుగా అంజన్ గౌడ్ ప్రారంభించారు.మానసిక వికలాంగులకు అన్నదానం చేయటం నిజంగా గొప్ప విషయమని, ఈ అన్నదానానికి సహకరించిన జర్నలిస్టులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎలక్ట్రాన్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు పడిశాల రఘు,సీనియర్ జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్క విలేఖరికి సమస్య వచ్చిన వెంటనే స్పందించి సమస్య పరిష్కారం అయ్యే దిశగా కృషి చేసే వ్యక్తి అంజన గౌడ్ అని కొనియాడారు.ఆయన ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలను చేపడతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు,అనంతగిరి జర్నలిస్టులు,మునగాల జర్నలిస్టు పాల్గొన్నారు.