కోదాడ,జులై01(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యములో శనివారం రోజు డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ డే కోదాడ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నకిరికంటి రవికుమార్ (ENT ),డాక్టర్ సతీష్ కుమార్ MD లను శాలువాలతో ఘనంగా సన్మానించి,పుష్ప గుచ్చాలు అందజేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది.అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ డే సంధర్భంగా చార్టెడ్ అకౌంటెంట్ రేపాల నిహారికను,పత్తి నరేందర్ (ఆడిటర్) CA ఫైనల్ ను పుష్పగుచ్చాలు,శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమములో వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు ఇమ్మడి సతీష్ బాబు,కార్యదర్శి సేకు శ్రీనివాసరావు,కోశాధికారి వెంపటి ప్రసాద్,ఐపీసీ చల్లా విజయశేఖర్,జోన్ చైర్మన్ చల్లా లక్ష్మీనరసయ్య,ఉపాధ్యక్షులు రంగా కోటేశ్వరరావు,పత్తి నరేందర్,రేపాల వెంకట బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్స్ డే@చార్టెడ్ అకౌంట్ డే
RELATED ARTICLES