ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కోదాడ,జూన్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ లోని వాణిజ్య పన్నుల అధికారి కార్యాలయంలో ఆదివారం నాడు తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమర్షియల్స్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్,జిఎస్టి సిటిఓ కే నాగేందర్ పాల్గొని ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త ప్రో:జయశంకర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతోమంది త్యాగఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రం దినోత్సవం అని ఈ సందర్భంగా అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



