ఘనంగా తేజ ఫార్మసీ కళాశాల లో ఫార్మా ఫెస్ట్
Mbmtelugunews//కోదాడ,జనవరి 09 (ప్రతినిధి మాత్రమే సురేష్):స్థానిక తేజ ఫార్మసీ కళాశాల లో విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి రెడ్డి అధ్యక్షత గురువారం నిర్వహించారు.ముఖ్య అతిథిగా కోదాడ పట్టణ సీఐ టి రాము హాజరై మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని,విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ తో చదివి ఆ లక్ష్యాలను సాధించాలని అన్నారు.ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా మహమ్మారి కి వ్యాక్సిన్ కనుగొనటంలో ఫార్మా రంగం కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు.కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని,విద్య నేర్పిన గురువులను గౌరవించాలని అన్నారు.అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు చైర్మన్, పందిరి నాగిరెడ్డి,సీఈఓ యస్ యస్ రావు లు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాయి వికాస్ డిగ్రీ,యం యస్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు పి గంగాధర్ రావు,యం ప్రసాద్,అధ్యాపకు రాళ్ళు కవిత,సల్మా,సాహితీ,వీర కుమారి,అంజుమ్, నిఖత్,అమ్రీన్,రమాదేవి,అరుణ, సిబ్బంది ప్రవీణ,జి నాగేశ్వర రావు,బి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.