ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
జనగామ,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జనగామ జిల్లా
స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ… మీ యొక్క గ్రామంలో కుల బహిష్కరణలు కానీ అంటరానివారు అని గాని ఎవరైనా దూషించిన వారి పైన చర్యలు ఉంటాయని గుళ్ళు గోపరాలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళని రానీయకుండా మిమ్మల్ని అంటరానివారీగా చూడడం ఇలాంటివి జరగకుండా మీకు అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.కాబట్టి మీరు కూడా ప్రస్తుత అవగాహన రహీతులుగా ఉండాలని కోరుకుంటున్నాను.అలాగే మీ యొక్క గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురావాలి గ్రామపంచాయతీ ఏవో దృష్టికి తీసుకురావాలని చెప్పారు.ప్రజలంతా సమానమేనని పౌర హక్కులను ఎలా వినియోగించుకోవాలో కనువిప్పు చేశారు.