ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ద్వారకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ పాలకి సురేష్ పాల్గొని జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసమానతలు వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్తని కొనియాడారు .స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా 30 ఏళ్లపాటు సేవలందించి 1971 యుద్ద సమయంలో రక్షణ మంత్రిగా భారత విజయంలో కీలక పాత్ర పోషించారు కీలక పాత్ర పోషించిన దళిత నాయకుడిగా చరిత్రలో నిలిచారు అని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో వార్డ్ మెంబర్ వనపర్తి పిచ్చయ్య, శీలం నాగమణి కోటేశ్వరరావు, పాలడుగు జాన్, ఓగ్గు నాగేంద్రబాబు, సుంకరి మల్లేశ్వరరావు, సిలం బజార్ తదితరులు పాల్గొన్నారు.



