ఘనంగా బొడ్రాయి, ముత్యాలమ్మవార్షికోత్సవం
చిలుకూరు,జూన్ 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల కేంద్రం పాత చిలుకూరులో నూతన బొడ్రాయి, ముత్యాలమ్మ తదితర విగ్రహాలు ఏర్పాటు చేసి సంవత్సరం అయిన సందర్భంగా బుధవారం మొదటి వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బొడ్రాయి,ముత్యాలమ్మ తదితర దేవాలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు,గ్రామ పెద్దలు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



