Tuesday, December 24, 2024
[t4b-ticker]

ఘనంగా భారతరత్న మథర్ తెరిస్సా 27 వ వర్ధంతి

- Advertisment -spot_img

ఘనంగా భారతరత్న మథర్ తెరిస్సా 27 వ వర్ధంతి

:కోదాడ నియోజకవర్గం యునేటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవ. డా.వి. యెషయా

mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్05:కోదాడ పట్టణ పరిధిలోని మున్సిపాలిటీ ప్రాంగణంలో వున్నా మథర్ థెరిస్సా విగ్రహం వద్ద కోదాడ నియోజకవర్గ యునేటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవ డా,,వి యెషయా ఆధ్వర్యంలో భారతరత్న మథర్ తెరిస్సా 27 వ వర్ధంతి ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధి మున్సిపల్ ఛైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్,క్రిస్టియన్ కో ఆప్షన్ మెంబర్ వంటెపాక జానకి యేసయ్య,ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మథర్ థెరిస్సా సోషల్ ఆర్గనైజెషన్” నల్గొండ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ లు పాల్గొని మథర్ తెరిస్సా 27 వ వర్ధంతి సందర్బంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మథర్ తెరిస్సా సేవలు చిరస్మరణీయం అనీ సమాజంలో ఆమె చేసిన సేవా ప్రపంచంనీకే ఆదర్శం అనీ అన్నారు.భారతరత్న మదర్ థెరీసా సెప్టెంబర్ 5, 1997 లో కలకత్తా లో మరణించిందని.ఈమె అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసి.భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా (కలకత్తా) లో,1950 లో స్థాపించింది.45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో,ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ,పేదలకు(కుష్ఠు) రోగగ్రస్తులకూ,అనాథలకూ,పరిచర్యలు చేసింది.తద్వారా 1970 ల నాటికి మానవతా వాదిగా,పేద ప్రజలు,నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తి పొందింది.ఈమె తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని,1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిదని అన్నారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై,ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి,హెచ్ఐవిఎయిడ్స్,కుష్టు,క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను,గృహాలను,ఆహార కేంద్రాలను,బాలల,కుటుంబ సలహా కార్యక్రమాలను,అనాథ శరణాలయాలను,పాఠశాలలను స్థాపించిందఅని.ఆమె అనేక మంది వ్యక్తులు,ప్రభుత్వాలు,సంస్థలచే ప్రశంసలు పొందిందని,ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ చే దైవ ఆశీర్వాదం (బీటిఫికేషన్),సేయింట్ మరియు బ్లెస్డ్ థెరెసా ఆఫ్ కలకత్తా బిరుదు పొందిందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో చార్లెట్ హోం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు,కో ఆర్డినేటర్ మాడ్గుల సుందర్ రావు,నియోజకవర్గం సెక్రెటరీ పాస్టర్ రాజేష్,కోర్కెమిటీ చైర్మన్ రెవ డా,,సిహెచ్ లూకా,టౌన్ ప్రసిడెంట్ ప్రభుదాస్,నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజారావు,పాండు,రెవ మీసా దేవసహాయం,రెవ తలకప్పల దయాకర్,రెవ రవికాంత్,సూర్యాపేట పాస్టర్స్ గౌరవ సలహాదారులు బొక్క ఏలీయా రాజు,సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ ఇంజమూరి గాబ్రియేల్,ప్రధాన కార్యదర్శి రెవ ధరవత్ లాకు నాయాక్,వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొజ్జ ప్రశాంత్ కుమార్,నియోజకవర్గ అధ్యక్షులు రెవ డా,, జలగం జేమ్స్,పెన్ పహాడ్ పెలోషిప్ అధ్యక్షులు రెవ డా,, దేవతోటి జాన్ ప్రకాష్,నియోజకవర్గం గౌరవ సలహా దారులు రెవ బొక్క ఏలీయా రాజు,సూర్యాపేట రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పుల క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular