Saturday, April 11, 2026
[t4b-ticker]

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Mbmtelugunews//(కోదాడ)చిలుకూరు, ఏప్రిల్ 11( ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని బేతవోలు జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాగి గురవయ్య ముందుగా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొప్ప సంఘసంస్కర్త, అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, కుల నిర్మూలన కోసం కృషిచేసిన మహాత్మ, సామాజిక సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల విద్యాభివృద్ధి కోసం పోరాటం చేసిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. అనంతరం పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కే కృష్ణ మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర మొత్తం చక్కగా వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చందా శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, వీరబాబు, శౌరి, వెంకన్న, ఉపేందర్, కల్పన, శ్రీరామ్, ప్రకాశం, వెంకటేశ్వర్లు, నరసింహారావు, మైసయ్య, లాల్ మహమ్మద్, రాజ్యం పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular