ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
Mbmtelugunews//కోదాడ,మే 21(ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో నూకతోటి త్రినాధ్ అధ్యక్షతన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు హాజరై ఘననివాలి అర్పించటం జరిగింది.ఈ సందర్బంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాసాని శ్రీను,కాసాని వీరయ్య,మీగడ లింగయ్య,అనుబత్తుల సుబ్బారావు,జిల్లపల్లి శ్రీనువాసరావు,రేవూరి సత్యనారాయణ,నంబూరి లక్ష్మయ్యా,లక్ష్మణ్,సత్యం,లెక్కల శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.