ఘనంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం…
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 31(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలోని శ్రీనివాస నగర్ 30 వార్డులో శ్రీరామ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా గణేష్ విగ్రహం వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రాంతి ఫౌండేషన్ స్కూల్ యాజమాన్యం పద్మలత శ్రీనివాస్ రావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం గణేష్ విగ్రహం వద్ద సట్టు సీతారాములు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



