ఘనంగా వీరాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం
చిలుకూరు,జూన్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల కేంద్రం చిలుకూరు బస్టాండ్ సెంటర్లో గల పూరాతన
వీరాంజనేయ స్వామి దేవాలయం పునః ప్రతిష్టాపన జరిగి ఏడాధి పూర్తియిన సందర్భంగా ఆదివారం దేవాలయంలో ప్రధమ వార్షికోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయంలో అభిషేకాలు,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు ధ్వజస్తంభంకు జలభిషేకం చేశారు.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ వారు దేవాలయ ఆవరణంలో అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.