Wednesday, March 4, 2026
[t4b-ticker]

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Mbmtelugunews//కోదాడ, మర్చి 03(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని మూడో వార్డు తమ్మరబండపాలెం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి 9 గంటలకు శ్రీవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ముడుంబ వేణుగోపాల చార్యులు అధ్యక్షతన కళ్యాణ మహోత్సవ వేలాది మంది భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ సుమారు 600 ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలసిన ఈ స్వామివారి విశిష్టత ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు.

ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోం దని, ఈ ఏడాది కూడా భక్తుల సమక్షంలో శ్రీవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు వెల్లడించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారని తెలిపారు. భక్తుల సహకా రంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించి మొక్కులు పెట్టుకున్న వారికి వరప్రసాదం లభిస్తుందనే విశ్వాసం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular