ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం
Mbmtelugunews// నడిగూడెం, మార్చి 27 (ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం శుక్రవారం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద సమర్పణ భక్తులకి అందజేశారు.

కేశవాపురం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రాములవారి కళ్యాణాన్ని కనుల పండగ తిలకించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గుజ్జర్లపూడి అర్జున్ రావు, ఆలయ కమిటీ మెంబర్లు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



