కోదాడ,సెప్టెంబర్ 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సెప్టెంబర్ ఐదున జరిగిన ఉపాధ్యాయ దినత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాగార్జునపూ రామలింగేశ్వర చారి ఎంపికైనారు . ఈయన గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లోని మోడల్ స్కూల్ లో టీజీటీ గా పనిచేస్తున్నారు.ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని రామలింగేశ్వర చారిని కోదాడ నియోజకవర్గపు విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించటం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామలింగేశ్వర చారి బోధనతోపాటు విద్యార్థులలో సామాజిక అంశాలపై నైపుణ్యం పెరిగేలా చొరవ చూపటంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గపు విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అనంతారపు కృష్ణయ్య,ప్రధాన కార్యదర్శి ఆకవరపు రవీంద్రనాథ్ ఠాగూర్,ఉద్దోజు శ్రీనివాస చారి,కొప్పోజు జ్యోతి,కోదాడ ఎంపీడీవో విజయశ్రీ,రాగిఫణి సత్యనారాయణ,విశ్రాంత ఉపాధ్యాయులు భద్రయ్య చారి,ఇటికాల సురేష్,మడూరి ఓంకార్,వెగ్గళపు నరసింహ చారి,వెగ్గలపు కిషోర్ బాబు విశ్వరూపచారి,బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సన్మానం పొందిన నాగార్జునపూ రామలింగేశ్వర చారి
RELATED ARTICLES



