ఘనంగా సర్పంచి దొంతగాని అప్పారావు జన్మదిన వేడుకలు
దొంతగాని యువసేన ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, యాచకులకు అన్నదానం
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 04(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ సర్పంచి దొంతగాని అప్పారావు జన్మదిన వేడుకలు దొంతగాని యువసేన ఆధ్వర్యంలో కోదాడలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కోదాడ ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం భిక్షాటన చేస్తున్న వారికి ఆహార పొట్లాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జననాయకుడు దొంతగాని అప్పారావు జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

గ్రామంలో గ్రామ ప్రజలు సర్పంచి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారని అన్నారు. సర్పంచి గ్రామాభివృద్ధి కోసమే పాటుపడుతున్నారని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గోపి, తెలంగాణ రిపబ్లికం సేన జనరల్ సెక్రటరీ బోసు, పూర్ణాచారి, పాషా, నాగచారి, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



