ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 19:పట్టణంలో సెమీ క్రిస్మస్ ఆరాధన గురువారం ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అతిథులుగా సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీస్తు నిజమైన వెలుగుగా ఈలోకానికి వచ్చాడని నిజమైన స్నేహితుడుగా ఉన్నాడని కొనియాడారు.ప్రపంచ దేశాలు మొత్తం జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అని గుర్తు చేశారు.అన్ని పండగలకు క్యాలెండర్ లో డేటు మారతాది కానీ క్రిస్మస్ పండుగ డేటు మారదని అన్నారు.అనంతరం కోదాడ పట్టణ ప్రజలకు,ప్రజాప్రతినిధులకు,అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు.మర్యాదపూర్వకంగా అంజన్ గౌడ్ ని సన్మానించిన కమిటీ సభ్యలు.