చదువుకు పేదరికం అడ్డు కాదు:రావెళ్ల సీతారామయ్య
కోదాడ,మే 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక ఎమ్మెస్ కళాశాల అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ను రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య సందర్శించి,విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు రాదని,ఆస్క్ కోచింగ్ సెంటర్ ద్వారా ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మీ బంగారు భవిష్యత్తు కు బాటలు వేసే విధంగా కృషి చేయాలని కోరారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆస్క్ కోచింగ్ సెంటర్ కు ఆర్థికంగా సహకరించిన దున్న వెంకటేశ్వర్లు (డివి) జేఎల్ గురుకుల పాఠశాల మఠంపల్లి ఘనంగా సన్మానించడం జరిగింది.ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షన్ల సంఘం ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు,కోర్స్ కోఆర్డినేటర్ గంధం బుచ్చారావు,కే శ్రీకాంత్ విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు



