చింతలపాలెంలో రేపే క్రీడా పాఠశాల ఎంపికలు
mbmtelugunews.com//చింతలపాలెం, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్స్‌లో 4వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన (మంగళవారం) మండల స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు చింతలపాలెం మండల విద్యాధికారి (MEO) N. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఆవరణలో ఉదయం 9 గంటల నుండి ఈ ఎంపికలు ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ‘మోటార్ క్వాలిటీ’ పరీక్షలు నిర్వహించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను జిల్లా స్థాయి ఎంపికలకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వ్యాయామ ఉపాధ్యాయులు ఉస్మాన్ (ఫోన్: 9505937867) ని సంప్రదించాలని సూచించారు.
చింతలపాలెంలో రేపే క్రీడా పాఠశాల ఎంపికలు
RELATED ARTICLES



