చింతలపాలెం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకి,రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన
:రాష్ట్రము చివరిలో ఉన్న చింతలపాలెం మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతా.
:అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇల్లులు.
:మూడు దశబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొన్ని చూసుకుంటున్నారు.
రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
Mbmtelugunews//హుజూర్ నగర్/చింతలపాలెం,నవంబర్24(ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి):రాష్ట్రము చివరలో ఉన్న చింతలపాలెం మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆదివారం చింతలపాలెం మండల కేంద్రంలో2.62 కోట్ల రూపాయలతో నిర్మించే తహసీల్దార్ కార్యాలయం,2.98 కోట్ల రూపాయలతో నిర్మించే మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం,2.38 కోట్ల రూపాయలతో నిర్మించే పోలీస్ స్టేషన్ కార్యాలయాల భవనాలకు అలాగే 10 కోట్ల రూపాయలతో మేళ్లచెరువు నుండి చింత్రియాల రోడ్డుకి మేళ్లచెర్వు నుండి 8.6 కి. మీ రోడ్డు బలపర్చటం, 1.4 కి. మీ రోడ్డు వెడల్పు చేసే నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.
ముందుగా చింతలపాలెం మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు మూడు దశబ్దాలుగా నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని వారికి అన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు నేడు నూతన కార్యాలయాల నిర్మాణ పనులకు అలాగే రోడ్లకి శంకుస్థాపన చేయటం నాకు చాల సంతోషంగా ఉందని అన్నారు.నేను మొదటి సారి ఎమ్మెల్యే గా గెలిచినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రోడ్లు వేపించానని,లిప్ట్ ఇరిగేషన్ ల ద్వారా రైతులకి సాగు నీరు వసతి ఏర్పాట్లు చేశామని అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహం అలాగే అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు.రాష్ట్రము లో ప్రజా ప్రభుత్వం నడుస్తుందని అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇల్లులు నిర్మిస్తామని తెలిపారు.తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు,సంక్షేమ అభివృద్ధి పనులు వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించటం జరిగిందని 48 గంటలలో రైతులకు 100 కోట్ల రూపాయలు జమ చేయటం జరిగిందని తెలిపారు. చింతలపాలెం మండలంలో
సిసిఐ ద్వారా రెండు ప్రత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని అన్నారు.అనంతరం కిష్టాపురం క్రాస్ రోడ్ వద్ద 15 కోట్ల రూపాయలతో పి ఆర్ సిమెంట్ క్రాస్ రోడ్డు నుండి కిష్టాపురం క్రాస్ రోడ్డు వరకు 10.5 కి. మీ. లు రోడ్డు వెడల్పు చేసే పనులకు శంఖుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు సూచించారు.అలాగే లిప్ట్ లకి సంబందించిన ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకి తెలియపరిస్తే మరమ్మత్తులు చేపిస్తానని మంత్రి హామి ఇచ్చారు.ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పి నాగేశ్వరావు,హుజూర్ నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు,ఆర్&బి ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి,ఈఈ సీతారాం,డిఈ పవన్ కుమార్,ఎఈ సతీష్ కుమార్,తహసీల్దార్ సురేందర్ రెడ్డి,ఎంపిడిఓ భూపాల్ రెడ్డి,ఆర్ ఐ వాసుదేవరావు,అధికారులు,సిబ్బంది,చింతలపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరాల కొండారెడ్డి,ఇంద్రారెడ్డి,ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.