కోదాడ,జనవరి 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిమిర్యాల నూతన అధ్యక్షునిగా కొత్త రఘుపతి ఎన్నికయ్యారు.బుధవారం మండల పరిధిలోని చిమిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో మూడు గ్రామాలు కలిపి సొసైటీ ఏర్పాటు జరిగింది.చిమిర్యాల గ్రామం నుండి ముగ్గురు సభ్యులు,మంగలి తండా నుండి ఒకరు సభ్యులు,నల్లబండగూడెం నుండి నలుగురు సభ్యులు,ద్వారకుంట నుండి ఐదుగురు సభ్యు మొత్తం 13 మంది తో సంఘం ఏర్పాటు అయినది.ఈ పాలకవర్గ సభ్యులు అవిశ్వాసం కోరగా,సూర్యాపేట జిల్లా సహకార అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించడం జరిగింది.ఈ ఎన్నికలో సంఘ పాలకవర్గ సభ్యుడు కొత్త రఘుపతిని నూతన అధ్యక్షునిగా,ఉపాధ్యక్షునిగా పత్తిపాక రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు కొత్త రఘుపతి మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు,ముత్తవరపు పాండురంగారావు,చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి లకు మా పాలకవర్గం తరపున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం నూతన అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.గెలిచిన కొత్త రఘుపతిని మాజీ చైర్మన్ ముత్తవరపు రమేష్ శాలువ కప్పి సన్మానించారు.నాపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్నందుకు సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో 12 మంది డైరెక్టర్లు,గ్రామ పెద్దలు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక
RELATED ARTICLES



