చిరు వ్యాపారాలు ఫుట్ పాత్ ఆక్రమిస్తే చర్యలు తప్పవు,:ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్
కోదాడ,జూన్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:చిరు వ్యాపారులు ఫుట్ పాత్ ను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణం లో ప్రధాన రహదారి పక్కన చిరు వ్యాపారుల ఫుట్ పాత్ ఆక్రమణ లను క్రమబద్ధీకరించి మాట్లాడారు.ఫుట్ పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందన్నారు.ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు.ఫుట్ పాత్ లను చిరు వ్యాపారులు ఆక్రమించడం వలన వాహనదారులు వాహనాలు పార్కు చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడి వాహనాలు రోడ్లమీద పార్కు చేస్తున్నారు అలా వాహనాల రోడ్లపై పార్క్ చేయటం వలన ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని అన్నారు. అసలే వర్షాలు సీజను వాహనదారులు వర్షం పడే సమయంలో ఉక్కిరిబిక్కిరిగా వస్తుంటారు అలాంటి సమయంలో చిరు వ్యాపారుల వద్ద వాహనాలు రోడ్లపై పార్కు చేసి ఉంటే ప్రమాదంలో జరిగే అవకాశం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిబ్బంది ట్రాఫిక్ ఏఎస్ఐ కే వెంకటేశ్వర్లు,హెడ్ కానిస్టేబుల్ ఖయ్యూం, హోంగార్డు శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.



