చిలుకూరులో పెట్రోల్ దొంగలు
చిలుకూరు,జులై 28(mbntelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పరిధిలోని చిలుకూరులో పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు.శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పలువురు చిలుకూరు బస్టాండ్ సెంటర్లో గల మూడు ఇళ్లలోని 8 బైక్ లలో పెట్రోల్ దొంగతనం చేశారు.ఇంటి భయట పార్కు చేసిన వాహానాల్లో ట్యాంక్ దగ్గర పైపులను తీసి పెట్రోల్ దొంగలించారు.ఆదివారం ఉదయం లేచి బైక్ లు తీసి స్టార్ట్ చేసే సమయంలో తమ ద్విచక్ర వాహానాలలో పెట్రోల్ దొంగతనంకు గురైనట్లుగా బాదితులు గుర్తించారు.ఈ విషయంపై చిలుకూరు పోలీస్టేషన్ లో ఫిర్యాధు చేసినట్లుగా బాదితులు తెలిపారు.పోలీసులు స్పందించి ‘పెట్రోల్ దొంగలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని బాదితులు డిమాండ్ చేస్తున్నారు.