కోదాడ,జులై 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:చిలుకూరు గ్రామ పరిధిలోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలోని నివాసం ఉంటున్న పేద ప్రజలకు 2001, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 119, ఇళ్ల పట్టాలు సర్వే నెం, 930,931,932,933,934,935, భూమిలో ఇళ్ల పట్టాలు ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది.పై అధికారుల ఆదేశాల ప్రకారం సర్వే చేయడానికి అధికారులు భూమి దగ్గరికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది త్వరలో ఇళ్ల స్థలాల ఆక్రమించిన వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు అర్ఐ మంజుల,సర్వేరు నాగేశ్వరరావు,విఆర్ఎ రవి,ఇళ్ల పట్టాదారులు,టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు అమరారపు శ్రీమన్నారాయణ,ముదిగొండ నాగయ్య,మల్లెపంగు నారాయణ,నూకపంగు మణికంఠ,కందుకూరి శీను,కందుకూరి నాగయ్య,కందుకూరి చిన్న శీను,గజ్జి లక్ష్మి,కందుకూరి ఎల్లయ్య,అంజయ్య తదితరులు పాల్గొన్నారు
చిలుకూరు గ్రామంలో జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలోని సర్వే చేసిన రెవెన్యూ అధికారులు
RELATED ARTICLES