చిలుకూరు మండలానికి చెందిన బేతు సుధాకర్ చారికి అర్థశాస్త్ర విభాగంలో డాక్టరేట్
Mbmtelugunews//చిలుకూరు,డిసెంబర్ 24 (ప్రతినిధి మాతంగి సురేష్)చిలుకూరు మండల పరిధిలోని జెర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన బేతు సుధాకర్ చారి ఉస్మానియా యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగంలో డాక్టరేటు ను యూనివర్సిటీ పరీక్షలు విభాగం ప్రకటించింది.ప్రొఫెసర్ బి నారాయణ పర్యవేక్షణలో ఏ స్టడీ ఆన్ అగ్రికల్చరల్ గ్రోత్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ డిస్పారిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ పరీక్షలు విభాగం అధికారులు ఆయనకు పీహెచ్ డీ పట్టాను ప్రధానం చేసినట్లు ఒక ప్రకటనలో విడుదల చేశారు.అంతేకాకుండా ఇతను పలు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలలో వివిధ పరిశోధన పత్రాలను సమర్పించారు.ఇతను రాసిన ఆర్టికల్స్ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమైనాయి జేర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన బేతు సుధాకర్ చారి తల్లిదండ్రులు బేతు కోటయ్య బుచ్చమ్మ వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు.అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు తమ కొడుకు డాక్టరేట్ పొందటాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా భేతు సుధాకర్ చారి డాక్టరేట్ సాధించడంతో ఆయనను కుటుంబ సభ్యులు,అధ్యాపకులు,స్నేహితులు,పరిశోధక,విద్యార్థులు అభినందించారు.