చెరుకుపల్లి శివారులో జగదీష్ హత్య కావించబడిన అంతకులు అరెస్టు
Mbmtelugunews//నల్లగొండ జిల్లా,అక్టోబర్ 02:డిండి మండలంలోని చెరుకుపల్లి శివారులో శనివారం హత్య కావింపబడిన జగదీష్ (35) హంతకులు అరెస్టు కాబడినట్లు దేవరకొండ డిఎస్పి గిరిబాబు తెలిపారు.కేతేపల్లి మండలానికి చెందిన జగదీష్ కు,డిండి మండలంలోని కామేపల్లి గ్రామానికి చెందిన రమాదేవితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.కొంతకాలం నుండి భార్యాభర్తలకు గొడవలు వల్ల భర్త నుండి రమాదేవి దూరంగా ఉంటుంది.ఈ క్రమంలో జగదీష్ దురాలవాట్లకు లోనై,జులాయిగా తిరుగుతుండేవాడు.తరచుగా భార్యని వేధిస్తూ అత్త కుటుంబంతో తగాదా పడుతుండేవాడు.ఈ క్రమంలో తన సడ్డకుడు అయినా పెద్దయ్య మైనర్ కుమార్తెతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని,తరచుగా అమ్మాయిని వేధిస్తూ అరాచకాలకు గురి చేస్తూ ఉన్నాడు.ఈ క్రమంలో హైదరాబాదులోని ఆల్వాల్ లో నివాసముంటున్న జగదీష్ వద్దకు సడ్డకుడు పెద్దయ్య,అతని కుమారులు మధు,అరవింద్,పెద్దయ్య భార్య నిర్మల,హతుని భార్య రమాదేవి అద్దె కారులో బలవంతంగా హైదరాబాద్ నుండి ఎక్కిచ్చుకొచ్చే కాళ్లు చేతులు కట్టే చెరుకుపల్లి ప్రాంతం వద్ద శనివారం నాడు బండరాయి తలపై వేసి,అతి క్రూరంగా హత్య గావించారు.ఈ హత్య కేసును డిండి ఎస్ఐ రాజు,సిఐ సురేష్ తో పాటు చందంపేట నేరేడు కొమ్ము ఎస్సైలు, క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ తో చేదించి 48 గంటల్లో నిందితులను పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ పత్రికాముఖంగా తెలియజేశారు.ఈ సందర్భంలో సీఐ,ఎస్ఐ డిండి పోలీస్ సిబ్బందిని నల్లగొండ ఎస్పీ అభినందించారు పోలీస్ సిబ్బందిని డిఎస్పి గిరిబాబు స్వయంగా అభినందించారు.ఈ కేసులో ఏ వన్, ఏ టు, ఏ త్రీ గా హతుని భార్య రమాదేవిని చేర్చారు పెద్దయ్య మధు అరవింద్ నిర్మల నిర్మాణాన్ని నిందితులుగా గుర్తించి, కోర్టు రిమాండ్ కు పంపుతున్నట్లు డిఎస్పి తెలిపారు.విలేకరుల సమావేశంలో డిండి సీఐ సురేష్, ఎస్సై రాజు,పోలీస్ సిబ్బంది హుస్సేన్,తిరుపతయ్య,సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.



