కోదాడ,జూన్ 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ ప్రభుత్వం చేతివృత్తులు,కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసే పథకానికి చివరి తేదీ గడువుని పెంచాలని కోదాడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు ఆదివారం పత్రిక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ పథకం ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులకు జూన్ 6 నుండి జూన్ 20వ తారీకు వరకు మాత్రమే లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పెట్టుకునే అవకాశం కల్పించిందని,కానీ సాంకేతిక సమస్యల వలన రెండు రోజులు సర్వర్ పనిచేయకపోవడం వలన లబ్ధిదారులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపలేకపోవడం జరిగిందని ప్రభుత్వము సంబంధిత ఉన్నతాధికారులు ఈ పథకానికి సంబంధించిన చివరి తేదీని పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నట్లు ప్రకటనలో తెలిపారు.ఆన్లైన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.
చేతి వృత్తుల లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ధరఖాస్తు గడువు తేదీని పెంచాలి:మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు..
RELATED ARTICLES