కోదాడ,నవంబర్ 10(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:భారీ జన సంద్రోహం నడుమ పట్టణ విధులలో ర్యాలీగా బిసీవైపి అభ్యర్థి అబ్దుల్ మాలిక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో అవినీతి రాజకీయాలకు కుటుంబ రాజకీయాలకు పుల్ స్టాప్ పెడతామని అన్నారు. కోదాడ నియోజకవర్గం లో ఉన్న సమస్యలను నేను అనుభవించిన వ్యక్తిని కాబట్టి ఆ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.నా నామినేషన్ కి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. నా గుర్తు చెరుకు రైతు గుర్తు పై నాయకులు కార్యకర్తలు ప్రజలు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గద్ద నరేందర్ ,కోదాడ నియోజకవర్గ బీసీవైపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జన సంద్రోహం నడుమ బిసీవైపి అభ్యర్థి అబ్దుల్ మాలిక్ నామినేషన్
RELATED ARTICLES



