జరిమానా బోర్డు చెంతనే చెత్త….
కోదాడ,జులై 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:చిలుకూరు మండల పరిధిలోని కట్టకొమ్ముగూడెం గ్రామ శివారులో చెత్త వేయరాదని గ్రామపంచాయతీ అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు.కానీ ఆ బోర్డు వద్దనే చెత్తను పడవేస్తున్నా పంచాయతీ అధికారులు పట్టింపు లేకుండా చూస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో డెంగ్యూ,మలేరియా ఇతరత్రా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ అధికారులకు,మండల స్థాయి అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేదని వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు చెత్తను తొలగించి,మరోమారు చెత్త వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.