సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి…
కోదాడ,ఏప్రిల్ 02
(Mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జర్నలిస్టుల చిరకాల స్వప్నం ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం జర్నలిస్టుల సంతకాల తో కూడిన వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇబ్బందులను అంజన్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.గత కొంతకాలంగా ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నామని,ఎన్నికల ప్రచారంలో సైతం ఈ విషయం మీ దృష్టికి తీసుకు వచ్చామని గుర్తు చేశారు.సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున,ఆదేశాలు ఇవ్వలేనని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జర్నలిస్టుల సమస్య పరిష్కరిస్తానని, హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టి
డబ్ల్యూజేహెచ్ 143 జిల్లా ప్రధాన కార్యదర్శి హరికిషన్,ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు పడిశాల రఘు,నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాంధీ,కోట రాంబాబు,సిహెచ్ సురేష్,ఎం సురేష్,టి నాగరాజు,కే సైదులు,సిహెచ్ శ్రీకాంత్,టి లక్ష్మణ్,జి రాము,షేక్ నజీర్,సిహెచ్ శేఖర్,రమేష్,కే వాసు,సంపత్,కే నరేష్,శ్రీహరి,లింగయ్య,బసవయ్య,శీను తదితరులు పాల్గొన్నారు



