Monday, July 7, 2025
[t4b-ticker]

జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలలో యూనియన్లకు,రాజాకీయాలకు సంబంధం లేదు:కారింగుల అంజన్ గౌడ్

జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలలో యూనియన్లకు,రాజాకీయాలకు సంబంధం లేదు:కారింగుల అంజన్ గౌడ్

కోదాడ,జులై 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలలో యూనియన్లకు,రాజాకీయాలకు సంబంధం లేకుండా అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి విలేకరి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమం శ్రేయస్సు కోసం సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది అని జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు.శనివారం కోదాడ పట్టణ త్రివేణి కాలేజ్ లో కోదాడ నిర్వహించిన జర్నలిస్టుల కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత మొట్ట మొదటిగా రాష్ట్రంలో ఏర్పాడిన నూతన హౌసింగ్ సోసైటీ కోదాడ జర్నలిస్టులదే అని చెప్పారు.సొసైటీ లో పార్టీలకు,యూనియన్లకు అతీతంగా అక్రిడేషన్ కలిగి ఉన్న వర్కింగ్ జరలిస్టులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు.

జర్నలిజం వృత్తిని నమ్ముకొని అనేక పేద జర్నలిస్టులు ఇళ్లస్థలాల కోసం ఎదురుచూస్తున్నారని,తప్పనిసరిగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జర్నలిస్టుల చిరకాల కల అయినా ఇండ్ల స్థలాల మంజూరుకై ముందడుగు వేస్తుందని,ఆ దిశగా సొసైటీ పనిచేస్తుందని వారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు పడిశాల రఘు,కార్యదర్శి శ్రీనివాస రావు,సీనియర్ జర్నలిస్టు హరికిషన్ రావు,డైరెక్టర్లు కోట రాంబాబు,మల్లికార్జున రావు,కుడుముల సైదులు,మరికంటి లక్ష్మణ్,షేక్ నజీర్,తంగళ్ళపల్లి లక్ష్మణ్,శ్రీకాంత్,గోపాల్,సైదులు,శీను,గోపి,నరేష్,సురేష్,లింగయ్య,మల్లయ్య,వెంకటనారాయణ,శేఖర్, శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular