తుంగతుర్తి,జులై 26(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:బహుజన సమాజ్ పార్టీ జాజిరెడ్డి గూడెం మండల అధ్యక్షులు చెరుకుపల్లి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఈసీ మెంబర్ దాసరి శీను గారు మాట్లాడుతూ చత్రపతి సాహు మహారాజు గారి కొల్లాపూర్ సంస్థానంలో అణగారిన వర్గాలకు ఎవరి జనాభా దామాసం ప్రకారం వారికంతా వాటా ఇచ్చిన రిజర్వేషన్ల పితామహుడు మొట్టమొదటి చక్రవర్తి చత్రపతి సాహు మహారాజు గారు. అణగారిన వర్గాలకు ఉచిత ప్రాథమిక విద్య అందించారు. మహాత్మ జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే గారి ఆశయాలతో స్త్రీల విద్యను ప్రోత్సహించారు. ప్రత్యేకమైన హాస్టల్ పసత్తులు కల్పించడం కూడా జరిగింది.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్షులు మల్లెపాక వెంకటేష్,ఉపాధ్యక్షులు కమటం శోభ,ప్రధాన కార్యదర్శి ఎర్ర రాంబాబు,మహిళ కన్వీనర్ మరికంటి మనిషా,నాగారం మండల అధ్యక్షులు ఈదుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో రిజర్వేషన్స్ డే వేడుకలు
RELATED ARTICLES