Sunday, February 8, 2026
[t4b-ticker]

జాతిపితమహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జాతిపితమహాత్మా గాంధీ జయంతి వేడుకలు

:నేటి యువత జాతిపిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి.

: సత్యమేవ జయతే సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాదెళ్ళ బాలకృష్ణ

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 03(ప్రతినిధి మాతంగి సురేష్): నేటి యువత జాతిపిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని సత్యమేవ జయతే సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాదెళ్ళ బాలకృష్ణ అన్నారు. గురువారం సత్యమేవ జయతే సేవా సమితి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను స్థానిక బస్టాండ్ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా నాదెళ్ళ బాలకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో పల్లెలే దేశానికి పట్టుకోమ్మలని అర్థరాత్రి ఆడవారు ఒంటరిగా రోడ్లపై నడిచిన రోజు నిజమైన స్వాతంత్రం అని వారు కొని యాడారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడని
నేటి యువత జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడలలో నడవాలని సూచించారు. 2013 లో అప్పటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే చందర్ రావు లు ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. అప్పుడు మంత్రి పాత నేషనల్ హైవే రోడ్డును మహాత్మా గాంధీ రోడ్డుగా మారుస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు మారలేదని అన్నారు. ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన నామకరణం చేయడం లేదని పట్టణ ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు వాపోతున్నారు. మహిళలు త్రివర్ణ పతాక చీరలతో పట్టణ ప్రజలను అబ్బురపరిచారు. ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్, తేజ జానకి రామయ్య, సత్యాన్వేషణ మండలి చైర్మన్ సురేంద్రబాబు,కోతుంబాకా భాస్కర్, చందా శ్రీనివాసరావు,గుండా మధుసూదన్,గౌతమి, అరుణ రత్నదీప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular