జానకీనగర్ స్టేజీ వద్ద అదుపుతప్పి వడ్లలారీ బోల్తా
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 26 (ప్రతినిధి మాతంగి సురేష్):చిలుకూరు మండల పరిధిలో ప్రమాధవశాత్తు కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై చిలుకూరు మండల పరిధిలోని జానకీనగర్ స్టేజీ వద్ద ధాన్యం లారీ బోల్తా పడిపోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం కోదాడ నుండి హుజూర్ నగర్ వైపు ధాన్యం లోడ్ తో వెళ్తున్న లారీ ఒక్క సారిగా బ్రేక్ వేయడంతో అదుపు తప్పి లారీ బోల్తా పడడంతో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలైనాయి.అక్కడే సమీపంలో ఉన్న లారీ ఓనర్స్ అసోసియోషన్ వారు వచ్చి లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను భయటకు తీశారు.సమీపంలో ఉన్న హాస్పటల్ కు తీసుకువెళ్లారు.