జానిపాషాకు డాక్టరేట్ ప్రధానం
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 16 ప్రతినిధి మాతంగి సురేష్:ఉస్మానియా యూనివర్సిటీలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి షేక్ జానిపాషాకు పిహెచ్డి ప్రధానం చేశారు.ఆచార్య బి సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ముస్లిం మైనారిటీ-ఎ స్టడీ ఇన్ ద సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన చేసిన షేక్ జానిపాషాకు బుధవారం బిఒఎస్ ప్రొఫెసర్ డైసి,డీన్ ప్రొఫెసర్ శరత్ చంద్రలు వైవ నిర్వహించారు.ఈ వైవాలో సిద్ధాంత గ్రంథంను సమర్పించారు.ఎక్స్ టర్నల్ ఎక్సామినర్స్ గా నిజాం కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తం,కోఠి ఉమెన్స్ విశ్వవిద్యాలయ హెచ్ఓడి డాక్టర్ రత్నకుమారిలు వ్యవహరించారు.డాక్టరేట్ సాధించిన జానిపాషా ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,నడిగూడెం లో ప్రభుత్వ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నారు.2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డును సైతం అందుకున్నారు.పిహెచ్ డి డాక్టరేట్ సాధించినందుకు కుటుంబ సభ్యులు,తోటి అధ్యాపకులు,స్నేహితులు ఆనందం వ్యక్తపరిచారు.