కోదాడ,ఏప్రిల్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి వర్ధంతి,రాజ్యాంగ నిర్మాత,కుల రహిత సమాజం కోసం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక లాల్ బంగ్లాలో పిడిఎస్యు,పివైఎల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పిడిఎస్యు పూర్వ విద్యార్థి నాయకుడు, టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాపర్తి రామ నర్సయ్య పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలోని అణగారిన వర్గాల ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల సమానత్వం కోసం రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.సమాజం కులం మతం అనే తారతమ్యాలు లేకుండా సమానత్వం కలిగి ఉండాలని ఆలోచించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు.తను రాసిన రాజ్యాంగం సమగ్రంగా అమలుచేసి పది సంవత్సరాలో పేద మధ్యతరగతి దానికాని తేడా లేకుండా రిజర్వేషన్లు కల్పించి తదనంతరం రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కోరిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు.రాజ్యాంగ అమలుపరిచిన నేటి వరకు ఎవరికీ ఎటువంటి అవకాశాలు సమగ్రంగా అందకపోగా పేదవాడు పేదవాడిగానే మిగిలిపోయిన పరిస్థితిని నెలకొందని అన్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై మహిళలపై జరుగుతున్న అరాచకాలను తిప్పికొట్టడం కోసం ఓ మహోన్నత వ్యక్తి లాగా ముందుకొచ్చిన ఉస్మానియ అరుణతార కామ్రేడ్ జార్జి రెడ్డి అని అన్నారు.జార్జి రెడ్డి విద్యార్థుల హక్కుల కోసం మతోన్మాదులు చేస్తున్న రాజకీయాలకు వ్యతిరేకం ఉద్యమించి విద్యార్థులను శాస్త్రీయ పద్ధతులు ముందుకు నడిపి ఉస్మానియా యూనివర్సిటీలోని భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తిగా పేరుగాంచిన మహోన్నత విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి అని కొనియారు.జార్జి రెడ్డి బతికి ఉంటే మతోన్మాదుల అరాచకాలు ముందుకు సాగవని భావించి మతోన్మాదులు గుండాలు కలిసి నిరాయుదుడిగా ఉన్నటువంటి జార్జిరెడ్డిని ఇంజనీరింగ్ కళాశాల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో చుట్టుముట్టి 60 కత్తిపోట్లతో హతమార్చిన అతను అందించిన ఆశయ సాధన కోసం అతను అందించిన బిగిపిడికిలి జెండా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసి విద్యారంగ సమస్యలపై మతోన్మాదులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థి సంఘం పిడిఎస్యు అని అన్నారు.ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయ సాధన కోసం విద్యార్థులు ఉద్యమించాలని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆలంబిస్తున్న మతతత్వాలకు వ్యతిరేకంగా,నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముందుగా కామ్రేడ్ జార్జిరెడ్డి,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు పూర్వ విద్యార్థులు హరికిషన్,మురళి,వి నరసింహారావు,బసవయ్య,బి మురళి,అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి,పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు సింహాద్రి,పివైఎల్ జిల్లా కార్యదర్శి డి రవి,నరేష్,సైదులు,అనంతరాములు,మహేష్,రమేష్,నాగరాజు,విజయ్ తదితరులు పాల్గొన్నారు.
జార్జి రెడ్డి,అంబేద్కర్ ఆశయ సాధనకై ఉద్యమిద్దాం:పిడిఎస్యు పూర్వ విద్యార్థి రామ నర్సయ్య
RELATED ARTICLES



