జిల్లాలో ప్రతీ పశువు కి క్యూ ఆర్ కోడ్ చెవిపోగు, గాలికుంటు టీకా వేయాలి
డా దామరచర్ల శ్రీనివాసరావు జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ ప్రాంతీయ పశువైద్యశాల ప్రాంగణంలో కోదాడ, అనంతగిరి, చింతలపాలెం మండల సిబ్బందితో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకా పురోభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా శ్రీనివాసరావు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గాలికుంటు వ్యాధి సమూలంగా నిర్మూలనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా టీకా పురోగతిలో ఉందని, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు, సిబ్బంది కొరత తదితర వివిధ కారణాల రీత్యా చింతలపాలెం మండలంలో పురోగతి మందగించడం వలన కోదాడ అనంతగిరి మండలాల నుండి సిబ్బందిని రెండురోజులపాటు చింతలపాలేనికి కేటాయిస్తూ ఏడు టీములు తయారు చేసి ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఆ మండలంలో 100శాతం టీకా పూర్తిచేయడానికి సిబ్బందిని ఆదేశించారు.భవిష్యత్ లో పశువుల సామర్ధ్యం భారత్ పశుదాన్ అప్ ద్వారా దేశంలో సమీక్షించబడునని, ప్రతీ ఒక్క పశువు నాణ్యత, పాల దిగుబడి మొదలగునవి ఎవరైనా ఎక్కడ నుండైనా క్యూ ఆర్ కోడ్ కలిగిన పశువు చెవిపోగు ఎంట్రీ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.
పశువుకి చెవిపోగు నెంబర్ లేకుంటే మనిషికి ఆధార్ లేనట్టుగానే భవిష్యత్ లో అలాంటి పశువుకి ప్రభుత్వ పరమైన ఎలాంటి ప్రయోజనాలు అందవని, అలాగే గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించని పశువులకు మారకం విలువ ఉండదని అలాంటి ఇబ్బందులు ఏ రైతుకు రాకూడదు అంటే పశుపోషకులు తమ పశువులన్నింటికీ చెవిపోగులు గాలికుంటు టీకా వేయించుకునేలా గ్రామాల్లో ప్రచారం కల్పించి టీకా మరియు చెవిపోగుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చెయ్యాలని సిబ్బందికి సూచించారు.
సమీక్షా సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ డా,పి పెంటయ్య, కోదాడ , చింతలపాలెం, అనంతగిరి మండలలాల పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డా, బి మధు, డా, సిరిపురపు సురేంద్ర, మూడు మండలాల సిబ్బంది పాల్గొన్నారు.



