హైదరాబాద్,జులై 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వర్షాలు హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేస్తున్నాయి.ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుతోంది. ఇక మురుగు కాలువలు పొంగి పొర్లి ఇళ్లలోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో పాటు మరోవైపు పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒక చోటుచేసుకుంది.
అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో వాళ్లు ఆందోళన చెందారు. జీహెచ్ఎంసీ అధికారులకు సంపత్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోలేదు. అంతే ఆ యువకుడికి బీభత్సమైన కోపం వచ్చింది. పామును జీహెచ్ఎంసీ ఆఫీసుకి తెచ్చి వదిలాడు. ఆఫీసులోని టేబుల్‌పై పామును పెట్టి సంపత్ తన నిరసన వ్యక్తం చేశాడు…