సూర్యాపేట జిల్లా:తిర్మలగిరి(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): విద్యాశాఖ అధికారి కే.అశోక్ తిర్మలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్ ఎ టు పరీక్షలు రాస్తున్న విద్యార్థుల పేపర్లు పరిశీలించి విద్యార్థుల బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించడానికి తగు సూచనలు చేశారు.
అనంతరం మోడల్ స్కూల్ ను సందర్శించి మండల వనరుల కేంద్రంలో నిర్వహించబడుతున్న జాలి ఫోనిక్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ క్లాసులను సందర్శించారు. వీరి వెంట మండల విద్యాధికారి ఐ శాంతయ్య, మండల నోడల్ అధికారి దామర శ్రీనివాసులు ఉన్నారు.