కోదాడ,జులై 05 (mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలకు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి హాజరయ్యారు.వారు మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధుల ప్రత్యేక స్క్రీనింగ్ ఈ నెలలో జిల్లా వ్యాప్తంగా ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు.జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మనం ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని అన్నారు. బీపీని అదుపులో ఉంచుకోకపోతే శరీరంలోని అవయవాలపై తీవ్రమైన దుష్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందని,ఆ ప్రభావం మెదడు,కన్ను మరియు కిడ్నీల పనితీరు పై ఎక్కువగా ఉంటుందని అన్నారు.ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం చాలా అవసరం అని అన్నారు. ప్రతి రోజు అరగంట పాటు కనీస వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం ఆరోగ్య కార్యకర్తలకు బీపీ మిషన్లు పంపిణీ చేశారు.30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తమ బీపీని ఆరోగ్య కార్యకర్తల వద్ద పరీక్ష చేయించుకోవాలని, ఒక వేళ రక్తపోటు అదుపులో లేకపోతే వైద్యాధికారులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలని పేర్కొన్నారు.వీరి వెంట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుమాంజలి, ఆరోగ్య విస్తరణ అధికారి సురేంద్ర,రూపవతి,కళ్యాణి,కల్పన,మంగ,రజియా,జయ కుమారి,నీరజ,రాధ,వీర లక్ష్మి,జయ కుమారి తదితరులు ఉన్నారు.
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మనం ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు:డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి
RELATED ARTICLES