Friday, December 26, 2025
[t4b-ticker]

జీవితంలో ఒక్కసారి అయినా ప్రతి ఒక్కరు ఈ దేవాలయాన్ని సందర్శించాలి:శ్రవణ నక్షత్ర యుక్త శ్రీవారి మాస(శాంతి) కల్యాణములో పాల్గొనగలరు

కోదాడ,అక్టోబర్ 19(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:విజయ దశమీ(దసరా) శుభాకాంక్షలు.శ్లో// శ్రీరంగస్థల వేంకటాద్రి కరిగిర్యాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామ నికేతనేషు చసదా సాన్నిధ్య మాసే దుషే అర్చారూపిణ మర్చకాభి మతిత స్వీకుర్యతే విగ్రహం పూజాం చాఖిలవాంఛితా న్వితరతే శ్రీశాయ తస్మై నమ:// శ్లో//శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ,అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ.కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి మన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ప్రపన్నస్థలమైన మన బండపాలెములో సువిశాలమైన బండమీద దాదాపు వెయ్యేండ్ల క్రిందటనే స్వయంభువుగాను, స్వయంవ్యక్తునిగానువేంచేసి అశేష భక్తులకు దర్శనమిస్తూ,వారి కోర్కెల నిట్టే తీర్చుచు ,విశేష పూజలందు కొంటున్న మహా మహిమలు చూపుచున్న స్వామి అని మనకు తెలిసినదే.ఈదేవాలయంలో రమారమి పదాహారేండ్లకు పైబడి ప్రతి నెల శ్రవణ నక్షత్రము రోజున శ్రీవారి మాస(శాంతి)కల్యాణం జరువబడుచు,ఎందరో పిల్లలకు పెండ్లిండ్లు కుదిర్చి,చేయించి, ఎంతమందో సంతానార్థులైన దంపతులకు సంతానలక్ష్ముల నందిస్తూ,ఇతర సద్వాంఛలుగోరువారి కోర్కెలు శీఘ్రముగా నెరవేర్చుచు,వెలుగొందు చున్న దైవత దివ్యస్థలుడీ తమ్మర బండపాలెపు శ్రీనివాసుడు.ఇట్టి దేవాలయంలో ఈ శోభకృన్నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ నవమి(మహర్నవమి),తేది. 23/10/2023,సోమవారం ఉదయం 10గంటలకు శ్రవణ నక్షత్ర యుక్త శ్రీవారి మాస(శాంతి)కల్యాణము జరుపబడును. పైన చెప్పిన కోరికలు నెరవేర్చుకోదలచిన దంపతులు ముందురోజు(22/10/2023) వరకైన దేవాలయ అర్చకులనులేదా నిర్వాహకులను సంప్రదింపగలరు. మరియు తేది 24/10/2023,మంగళవారం నాడు విజయదశమి(దసరా)పర్వమును పురస్కరించుకొని ఉదయం 7గంటల నుండి పూజాదికాలు,తీర్థప్రసాదాదులు నిర్వహింపబడును.ఆ రోజు,మరి ముందురోజున కూడా పెరుమాళ్లకు విశేషపూజలు నిర్వహింపబడును. నూతన వాహనాలకు పూజలు కూడా చేయబడును.మరి ముఖ్యంగా 24వ తేదీ సాయంకాలము 5గంటలకు “అశ్వవాహన సేవ”(“పార్వేట సేవ”),శమీ వృక్ష పూజ జరుపబడును.కావున భక్తులెల్లరు సకాలానికి విచ్చేసి,స్వామివారి సేవలలో పాల్గొని,ధన్యులౌదుగాక! ఇట్లు, అర్చకులు, చైర్మన్ ముడుంబై వేణుగోపాలాచార్యులు,95530 93569,మరియు నిర్వాహకులు, స్థానాచార్యులు.ముడుంబై లక్ష్మణాచార్యులు,99481 74127.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular