జీవితంలో కోట్లు సంపాదించిన కలగని ఆనందం మంచి మిత్రుని పొందినప్పుడు ఆనందం కలుగుతుంది
:ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
కోదాడ,జులై 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణ కేంద్రంలోని ప్రగతి విధ్యానికేతన్ పాఠశాలలో 2007-2008 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు పూర్వ విద్యార్థి తమ్మర గ్రామానికి చెందిన నల్లూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని ఏఆర్ఏఆర్ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనంలో ఘనంగా నిర్వహించారు.మిత్రులు చాలా రోజుల తర్వాత కనిపించడంతో ఆత్మీయ పలకరింపులు,ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు.సరిగ్గా పదరేళ్ళ తరువాత వారంతా ఒక చోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేశారు.విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరువలేనివని,ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు.

సుమారు 40 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి నెలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి.ఇక నుంచి టచ్‌లో ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు మధుర జ్ఞాపకాలను తమ సెల్‌ఫోన్లలో స్పందించుకున్నారు. మన మిత్రులలో ఎవరికైనా ఆపద వచ్చిందంటే మేమున్నామంటూ మనమందరం వారికి సహాయపడే విధంగా ఉండాలని వారందరూ చర్చించుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు