జెర్రిపోతులగూడెం వాసికి డాక్టరేట్…
Mbmtelugunewd//కోదాడ/చిలుకూరు,నవంబర్ 09 (ప్రతినిధి మాతంగి సురేష్):చిలుకూరు మండల పరిధిలోని జెర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన పెండెం వెంకయ్య- మంగమ్మ దంపతుల కుమారుడు నరేందర్ డాక్టరేట్ పట్టాను అందుకున్నట్లుగా ఆయన శనివారం విలేకరులకు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని లైబ్రరీ ఇన్ఫర్మేషన్ విభాగం నుంచి డాక్టర్ పవన్ కుమార్ పర్యవేక్షణలో నీడ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్ ఆప్ అకడమిక్ లైబ్రరీస్ అనే అంశంపై పరిశోధన చేసి సమర్పించినందుకు డాక్టర్ అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు,అధ్యాపకులైన యాదగిరి,చక్రవర్తి,రవికుమార్,దుర్గాప్రసాద్,రాజా గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.