నార్కట్ పల్లి: భువనగిరి పార్లమెంట్(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని జై స్వరాజ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పట్టణ కేంద్రానికి చెందిన పురం సంతోష్ కుమార్ కి బుధవారం రోజున జై స్వరాజ్ పార్టీ జాతీయ అధినేత కాసాని శ్రీనివాస్ రావు గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.పురం సంతోష్ కుమార్ కు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి గా నియమించారు.మరియు జాతీయ పార్టీ అధికార ప్రతినిధి గా పార్టీ రాష్ట్ర,జాతీయ కార్యవర్గ సభ్యుల అభీష్టo మేరకు అధికారికంగా నియమించారు.కాసాని శ్రీనివాస్ రావు గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పది హెడు లోక్ సభ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ, ఇరవై ఐదు లోక్ సభ స్థానాల్లో పోటి చేస్తున్నామని భువనగిరి ఎంపీ గా పురం సంతోష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించి ఢిల్లీ పీఠం మీద కూర్చొబెడతమని ఆయన మాట్లాడుతూ అన్నారు.అదే విధంగా పురం సంతోష్ కుమార్ మాట్లాడుతూ నాకు ఇంత పెద్ద పార్టీ బరాన్ని అప్పగించిన పార్టీ అధినేత కాసాని శ్రీనివాస్ రావు గౌడ్కి మరియు పార్టీ జాతీయ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జై స్వరాజ్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పురం సంతోష్ కుమార్ నియామకం..,
RELATED ARTICLES