Wednesday, December 24, 2025
[t4b-ticker]

జోనల్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న.. జోనల్ అధికారి అరుణ కుమారి.

జోనల్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న.. జోనల్ అధికారి అరుణ కుమారి.

:నడిగూడెంలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్..

Mbmtelugunews//నడిగూడెం,నవంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఈ నెల 6 నుండి 8 వరకు జరగనున్నాయని జోనల్ అధికారి అరుణ కుమారి తెలిపారు. శనివారం నడిగూడెం మండల కేంద్రంలోని జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ నల్లగొండ,సూర్యాపేట జిల్లాల నుండి 9 పాఠశాలలకు చెందిన 765 మంది విద్యార్థులు స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు.నడిగూడెం, మఠంపల్లి, నిడమనూరు, కొండమల్లేపల్లి, నకిరేకల్,జీవి గూడెం, డిండి,కట్టంగూర్, సూర్యాపేట పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.స్థానిక గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్లు,పీఈటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీల సభ్యులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేటాయించిన బాధ్యతలను పాటిస్తూ వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.ఈ నెల 5 సాయంత్రం వరకు ఆయా పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేందుకు నడిగూడెం చేరుకుంటారని తెలిపారు. విద్యార్థులకు తగిన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారని పిడి, పీఈటీలు క్రీడల నిర్వహణలో నియమ, నిబంధనలు పాటిస్తూ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా క్రీడలను నిర్వహించాలన్నారు. వాలీబాల్, ఖొఖో, కబడ్డీ,టెన్నికాయిట్, రింగ్ బాల్,రన్నింగ్, లాంగ్ జంప్,హై జంప్ తదితర క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆట స్థలాన్ని శుభ్రం చేసి వెంటనే కోర్టులను వేయాలన్నారు.క్రీడల నిర్వహణకు సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డిసిఒలు సిహెచ్ పద్మ, శోభ రాణి, నడిగూడెం ప్రిన్సిపల్ చింతలపాటి వాణి, ప్రిన్సిపల్స్ సంధ్యారాణి, లలిత కుమారి, డి వెంకటేశ్వర్లు, సుష్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular