జ్యుయలరీ షాప్ ను ప్రారంభించిన:ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంజన్ గౌడ్.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ పట్టణం దినదినం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని సూర్యపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ అన్నారు.శుక్రవారం స్థానిక రంగా థియేటర్ ఎదురుగా నూతనంగా ఆధ్యా జ్యుయలరీ షాప్ ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్,ఆడిటర్ రఘునందనరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్యూయలరీ షాప్ నిర్వాహకులు కాసాని శ్రీనివాస్ గౌడ్ ను అభినందించారు.అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోదాడ పట్టణంలో ఆధ్యా జ్యుయలరీ షాపును నూతనంగా ప్రారంభిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.ఆర్డర్లపై బంగారం, వెండి ఆభరణాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని ఈ అవకాశాన్ని కోదాడ,పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు.