జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పట్టించుకోని ప్రభుత్వం.
:ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు కల్పించాలి.
:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం:బిజెపి నాయకులు జల్లా జనార్దన్.
Mbmtelugunews//కోదాడ,ఆగస్టు 28:ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని బిజెపి నాయకులు జల్ల జనార్దన్ అన్నారు.బుధవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు స్థానిక బిజెపి నాయకులతో కలిసి పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేసి మాట్లాడారు.ప్రభుత్వ ఆసుపత్రిలోకనీస వసతులు లేక ప్రజలందరూ ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని ప్రభుత్వం వెంటనే ఆసుపత్రుల్లో వైద్యులను నియమించి ప్రజలందరికీ సరైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మునగాల శ్రీనివాస్,వంగల పిచ్చయ్య,వెంకటేష్ బాబు,సాయి శర్మ,సుబ్బారావు,శ్రీనివాసరావు,కనకమ్మ,కోటమ్మ,నాగేంద్ర చారి,భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.