టాటా ఏఐఏ లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీతో ఎంతో మేలు
Mbntelugunews//కోదాడ,మార్చి 04(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలోని తమ్మర బండపాలెం గ్రామంలో కామన్ సర్వీస్ సెంటర్ (సియస్సి) ఆధ్వర్యంలో లబ్ధిదారుడికి టాటా ఏఐఏ లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 4 లక్షల రూపాయిలు నామినీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరిగింది.
కోదాడ లోని ఆజాద్ నగర్ కాలనీ నివాసి అయిన షేక్ దస్తగిరి ఆగస్టు నెలలో గ్రామంలో ఏర్పాటు చేసిన సియస్సి కేంద్రం ద్వారా 2060/– రూ తో టాటా ఏఐఏ లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం జరిగింది, అకస్మాత్తుగా గుండె పోటుతో లబ్దిదారుడు మరణించడం జరిగింది, కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 4 లక్షల రూపాయలు లబ్దిదారుడి నామినీ అయిన వారి కుమారుడు షేక్ నాగుల్ పాషా బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కామన్ సర్వీస్ సెంటర్ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ చీమ చరణ్,టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణ&ఏపి ఆర్ఎం పోలిశెట్టి సైదులు మాట్లాడుతూ ప్రజలు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ లో తక్కువ ప్రీమియం తో మైక్రో టర్మ్ పాలసీలు సియస్సి కేంద్రం లో అందుబాటులో ఉన్నందున ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సియస్సి కేంద్రం నిర్వాహకుడు యాదా నవీన్,కనగాల శ్రీధర్,సామినేని నరేష్,మాతంగి ప్రసాద్,కనగాల నారాయణ,వనపర్తి రమేష్,కందరబోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.